ఆంధ్రప్రదేశ్‌

‘స్థానికతే’ కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 5: హైదరాబా ద్ నుంచి తరలివచ్చే సెక్రటేరియట్ ఉద్యోగులనూ, హెచ్‌ఓడిలనూ కలవరపెడుతున్న అంశం ‘స్థానికత’. రాష్ట్ర విభజన తరువాత విద్యార్థుల స్థానికతను జోన్‌ల వారీగా విభజించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఉద్యోగులు విజయవాడ రానున్నారు. వారి పిల్లలను విజయవాడలోని స్కూళ్లలో చేర్చనున్నారు. విజయవాడ జోన్-2 పరిధిలోకి వస్తుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు జోన్-2 పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ఉద్యోగులు మూడు సంవత్సరాలపాటు విజయవాడలోనే ఉండాలని ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌లో నిబంధన విధించారని హెచ్‌ఓడి ఉద్యోగ సంఘ నాయకుడు సత్యనారాయణ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఆ తరువాత సెక్రటేరియట్, హెచ్‌ఓడిలు అన్నీ అమరావతి పరిధిలోకి వచ్చేస్తాయి. రాజధాని అమరావతి గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. గుంటూరు జిల్లా జోన్-3 పరిధిలోకి వస్తుంది. ఇక్కడే ఉద్యోగులకు సమస్య మొదలవుతోంది. ఇప్పటికే మూడేళ్లపాటు హైదరాబాద్‌లో చదివిన విద్యార్థులను విజయవాడ తీసుకొచ్చి ఆరు, లేదా ఏడో తరగతిలో చేర్చుతారు. మూడేళ్ల తరువాత జోన్-3లోకి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల జోన్-2లో సంపాదించిన సీనియారిటీ పోతుందని సత్యనారాయణ తెలిపారు. అప్పటికే విద్యార్థి తొమ్మిది, లేదా పదో తరగతికి వచ్చేస్తారు. ఒక విద్యార్థి ‘స్థానికత’ అర్హత పొందాలంటే, ఆ విద్యార్థి ఒకే జోన్‌లో ఏడేళ్లపాటు చదివి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్‌లో మూడేళ్లు, విజయవాడ జోన్-2లో మూడేళ్లు, గుంటూరు జోన్-3లో మూడేళ్లు చదివితే తమ పిల్లలకు ‘స్థానికత’ ఏవిధంగా అమలవుతుందని సత్యనారాయణ ప్రశ్నించారు. అందుకే ‘స్థానికత’ అంశంపై స్పష్టత వచ్చేంతవరకూ ఉద్యోగులు విజయవాడకు వెళ్లమని అంటున్నారని ఆయన స్పష్టం చేశారు. స్థానికత నిర్ధారణ కాకపోతే తమ పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
‘స్థానికత’కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖపై కేంద్రం కొన్ని కొర్రీలు వేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. అయితే కేంద్రం ‘స్థానికత’ అంశాన్ని తేల్చలేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక బృందాన్ని ఢిల్లీ పంపి దీనిపై స్పష్టత తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.