తెలంగాణ

కోమటిరెడ్డికి షోకాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నల్లగొండ, జూన్ 5: అసలే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలను, కార్యకర్తలను మరింత కృంగతీస్తోంది. టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కంటే ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరింత వీక్, వేస్ట్ అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డికి పార్టీ రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసు పంపించింది. అయితే అందుకు కోమటిరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ తాను ఆ షోకాజ్‌కు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. శనివారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర మంత్రి టి హరీశ్‌రావుతో చర్చలు జరిపి నేరుగా అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయానికి చేరుకుని కొంతసేపు మీడియాతో మాట్లాడారు. పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ, పార్టీలోని ముఖ్య నేతలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించినందున ఆదివారం షోకాజ్ నోటీసు పంపించినట్టు టి.పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం కోదండరెడ్డి తెలిపారు. టి.పిసిసి అధ్యక్షునిపై, ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారంలో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాఉండగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టి.పిసిసి షోకాజ్ నోటీసును తాను ఖాతరు చేయనని ప్రకటించారు. అసమర్థ టి.పిసిసిని తాను గుర్తించడం లేదని ఘాటుగా స్పందించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి టి.పిసిసి అధ్యక్షునిగా నియమితులైనప్పుడే పార్టీ నాశనమవుతుందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు అలాగే జరిగిందన్నారు. పనికిరాని టి.పిసిసి అధ్యక్షుని నిర్వాకం వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని మరోసారి ఉద్ఘాటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాలాడేటాను పరిశీలిస్తే ఎవరికి మద్దతిచ్చారో స్పష్టమవుతుందని కొత్త బాణం వేశారు. జిల్లా పార్టీలో తానే అందరికంటే సీనియర్‌నని అన్నారు.
తీవ్రంగా పరిగణిస్తున్నాం: జానా
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. పార్టీలో ఇటువంటి పరిణామాలు తనకు ఎంతో బాధ కలిగిస్తున్నాయని తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తితే పార్టీ ఆంతరంగిక సమావేశాల్లోనో, పార్టీ అధిష్టానం ముందో చర్చించాలే తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. ముఖ్య నేతలపై వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం జరగదని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా క్రమశిక్షణా రాహిత్యంగా ఉన్నాయన్నారు. మంత్రి హరీశ్‌రావును కలిసిన తర్వాతే కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.