తెలంగాణ

కొత్తగా 130 రెసిడెన్షియల్ పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 130 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, 30 సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌చైర్మన్ ఎస్. నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2016-17 విద్యాసంవత్సరం నుండే వీటిని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పేదల విద్యకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. దళితులు, గిరిజనులను విద్యారంగంలో మున్ముందుకు తీసుకువెళ్లాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దళితుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మారుమూల ప్రాంతాల్లోని దళితులకు కూడా విద్యాభ్యాసం కోసం అవకాశాలను కల్పిస్తున్నట్టు నిరంజన్‌రెడ్డి తెలిపారు.