తెలంగాణ

మెల్‌బోర్న్‌లో తెలంగాణ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. మెల్‌బోర్న్‌లోని క్యారమ్ డౌన్స్ ప్రాంతంలో శివ విష్ణు ఆలయ ప్రాంగణంలోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత అమరవీరుల స్థూపానికి కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనకోసం అందరం కలిసికట్టుగా పాటుపడదామని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ముద్దుబిడ్డలు ఒకవైపు ఆస్ట్రేలియా దేశ చట్టాలకు అనుగుణంగా ఉంటూ, తాము జన్మించిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాస భారతీయులను ఆమె కోరారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ ఉత్సవాల్లో ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్ జనరల్ తదితరులు పాల్గొన్నారు.