తెలంగాణ

బడి ఫీజుల నిర్ణయాధికారం పాలకమండళ్లకే జీవో జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలో స్కూలు ఫీజులను కట్టడి చేస్తామని, స్కూళ్ల బరితెగింపునకు ముకుతాడు వేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించిన కొద్ది గంటలకే స్కూలు ఫీజుల నిర్ధారణ అధికారం పాలకమండళ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఇఓలకు మెమోలు పంపించారు. ఇదే జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు తమ ఇష్టారాజ్యంగా ఫీజులను ఖరారు చేసే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పాలకమండళ్లు ఉన్నా అందులో పాఠశాల యాజమాన్యం, వారికి సన్నిహితంగా ఉన్న తల్లిదండ్రులే సభ్యులుగా ఉంటారని, వారిని లొంగదీసుకుని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులను నిర్ధారించి, తమకేమీ సంబంధం లేదని చెప్పే ప్రమాదం ఉందని వారు అంటున్నారు జీవో 1 (01/01/1994) ప్రకారం ఐదు శాతానికి మించకుండా లాభాలను ఆశించాలని పేర్కొన్నారు. ఈ జీవో ప్రకారం కనీసం 50 శాతం మేర జీతాలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. జీవో 42(30/07/2010) ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీల అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. జీవో 246 ప్రకారం పాఠశాలల నిర్వహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. సిబిఎస్‌ఇ చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో ఇద్దరు తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలి, వీరిని సంప్రదించిన తర్వాతనే ఫీజులను నిర్ధారించాల్సి ఉంటుంది. జీవో 91(06/08/2009) ప్రకారం వన్ టైమ్ ఫీజుగా అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు, తిరిగి చెల్లించే వీలుకల్పించే కాషన్ డిపాజిట్ ఫీజు 5వేల రూపాయలకు మించకుండా తీసుకోవాలి.