ఆంధ్రప్రదేశ్‌

తరలింపు వాయిదా వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్‌ను కోరారు. ప్రభుత్వం జూన్ చివరి నాటికి అమరావతి తరలివెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిందే తప్ప పూర్తి వివరాలు తమకు ఇవ్వలేదని, దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇస్తే బావుంటుందని వారు సిఎస్‌కు విజ్ఞప్తి చేశారు. అమరావతి వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఉద్యోగులను పంపించాలని, అందరినీ పంపాలని కోరడం సబబుకాదని పేర్కొన్నారు. భవనాలు అన్నీ పూర్తయిన తర్వాత ఉద్యోగులను తరలించాలే తప్ప ఏ సౌకర్యాలు లేకుండా ఉద్యోగులు తరలివెళ్లాలని చెప్పడం భావ్యం కాదని అన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తాను శనివారం చర్చించనున్నట్టు ప్రధానకార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ వారికి చెప్పారు. సాంకేతికంగా ఈ నెల 27వ తేదీ నుండి రాజధాని అమరావతి నుండి పనిచేస్తున్నట్టు లెక్కేనని, పూర్తిగా ఉద్యోగుల తరలింపుఇప్పటికిప్పుడే కాకున్నా కొంత ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం
డిప్యుటేషన్‌పై ఆంధ్రాకు వెళ్లి తాను ఉద్యోగం చేయలేనని, తెలంగాణలోనే ఉంటానంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆ ఉద్యోగి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉద్యోగిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి చక్కబడింది.

చిత్రం... పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి
పాల్పడ్డ చిరు ఉద్యోగి మహ్మద్ ఫక్రుద్దీన్