ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలపడిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు నిలదీసే సమయం వచ్చిందని, అందుకే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారని, అందులో తప్పుపట్టేందుకు ఏమీ లేదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబు ఆయనపైన వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మతిమరుపువ్యాధితో బాధపడుతున్నారని, నవ నిర్మాణ దీక్షలు ఎందుకని అడిగారు. అందరిచేత ప్రతిజ్ఞలు చేయించిన చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయించారా అని నిలదీశారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందంటూ, వృద్ధిరేటు రెండు అంకెలకు చేరుకుంటుందని పొంతన లేని వ్యాఖ్యలను చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్నారన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అన్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి ప్రతిపక్షం పార్టీని విమర్శించడమేంటన్నారు. మహానాడులో, నవ నిర్మాణ దీక్ష సందర్భంగా కూడా రాష్ట్ర పరిస్థితిపై మాట్లాడకుండా, ప్రతిపక్ష పార్టీని లక్ష్యంగా చేసుకోవడం ఏమి సంస్కారమన్నారు.
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు పిఏ కూడా వివాదస్పద వ్యవహారాల్లో చిక్కుకున్నారని, దీనిపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదన్నారు. జగన్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడితే సహించేది లేదన్నారు.