తెలంగాణ

కారెక్కనున్న కాంగ్రెస్ ఎంపీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వారంలో తెరాసలో చేరనున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయ. తొలుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాలతో దీనిపై నిర్ణయం జరగలేదు. రాష్ట్రంలో మొదటి నుంచి పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలపై తెరాస నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం వల్ల సాధారణ ఎన్నికల తరువాత పార్టీ బలపడింది. శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని రెండు నియోజక వర్గాల్లో మాత్రమే తెరాస ఓటమిపాలైంది. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పలువురు నాయకులు తెరాసలో చేరారు. ఇప్పుడు నల్లగొండ జిల్లాపై సైతం పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాంగ్రెస్‌కు పట్టున్న జిల్లాలో బలమైన సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ నాయకులను తెరాసలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా జరిగిన ప్రయత్నాలతో గుత్తా సుఖేందర్‌రెడ్డి తెరాసలో చేరేందుకు మార్గం సుగమమైనట్టు సమాచారం. తెరాస వర్గాల సమాచారం ప్రకారం వారంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సైతం తెరాసలో చేరనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు శాసన సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి భాస్కర్‌రావు హాజరయ్యారు. ఇలాఉండగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ తెరాసలో చేరాలన్న ఆలోచన లేదన్నారు. నల్లగొండలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు తాను స్పందిస్తూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలమని మాత్రమే వ్యాఖ్యానించానని ఆయన అన్నారు.