తెలంగాణ

రాష్ట్ర అవతరణ వేడుకల్లో పోలీసులకు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో శౌర్యం, ప్రతిభ కనబర్చిన పోలీసులకు వివిధ పతకాలను పరేడు గ్రౌండ్‌లో జరిగిన వేదికపై ముఖ్యమంత్రి అందజేశారు. ముఖ్యమంత్రి శౌర్యపతకం, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర మహోన్నత సేవా పతకం, ముఖ్యమంత్రి సర్వోత్తమ సేవా పతకం వంటి నాలుగు రకాల పతకాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా బహుకరించారు. ముఖ్యమంత్రి శౌర్య పతకం మార్చి-2014 తోటిచర్ల స్వామి సిఐ (ఖమ్మం), ఎన్ నాగేశ్వర్‌రావు ఆర్‌ఎస్‌ఐ (ఖమ్మం), కె శ్రీనివాసులు కానిస్టేబుల్ (ఇంటెలిజెన్స్, హైదరాబాద్ సిటీ) హైదరాబాద్ రేంజ్ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ బి రవీందర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం-2015 అవార్డులను కానిస్టేబుళ్ళు కె రాము, మీర్ మెహదీ, రషీద్, ఎండి ఖాదీర్, యామినీ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ షాహేద్ అలీ ఖాన్, శ్రీ్ధర్‌రెడ్డి ఇన్‌స్పెక్టర్ (కోదాడ), దివిటి వెంకటేశ్ ఎస్‌ఐ (రాజేంద్రనగర్) సైబరాబాద్, దివంగత తడాల ఈశ్వర్‌రావు కానిస్టేబుల్ సిఎఆర్ హెడ్ క్వార్టర్ (సైబరాబాద్), వెంకట్‌రెడ్డి ఎస్‌ఐ ఐటి సెల్ (సైబరాబాద్) అందుకున్నారు.తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పతకం-2016 అందుకున్న వారిలో పాకనాటి భూపాల్‌రెడ్డి (గ్రేహౌండ్స్), ఆర్ వేణుగోపాల్ అదనపు కమాండెంట్ (బీచుపల్లి, మహబూబ్‌నగర్), కె నర్సింహ ఒఎస్‌డి (నిజామాబాద్), ఆర్ వెంకట్‌నారాయణ ఎస్‌ఐ (స్పెషల్ బ్రాంచి, వరంగల్), మహ్మద్ యాసీన్, ఎస్‌ఐ (డిఎఆర్ వరంగల్), బి ప్రభాకర్‌రెడ్డి ఎస్‌ఐ టెక్నికల్ సర్వీస్ (హైదరాబాద్) ఉన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం-2016ను టి సుదర్శన్ డిఎస్‌పి (ఎసిబి కరీంనగర్ రేంజ్), మహ్మద్ అబ్దుల్ జబ్బర్ ఎస్‌ఐ (సూర్యాపేట), శ్రీనివాస్ మిశ్రా హెడ్ కానిస్టేబుల్ (ఇంటెలిజెన్స్, హైదరాబాద్) అందుకున్నారు.