తెలంగాణ

పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూన్ 1: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షంలో పిడుగు పడి చెరువు కట్టపై గల ఓ చెట్టుకింద ఉన్న ఇద్దరు మహిళలు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. చేపలు అమ్ముతున్న మానకొండూర్ మండల పరిధిలోని సదాశివపల్లి గ్రామానికి చెందిన కోతి లక్ష్మి (48), చేపలు కొనేందుకు వచ్చిన శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన బండ కవిత (36) అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ సంఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మానకొండూర్ చెరువు కట్టపైన వేప చెట్టు కింద సుమారు 20 మంది చేపలు అమ్ముకుంటున్నారు. బుధవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షంతో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. చెరువు కట్ట మరమ్మత్తులు చేస్తుండడంతో కట్ట్భాగం తడిగా ఉండడంతో వేసిన పిడుగుపాటుకు సుమారు పది మందికి తీవ్ర గాయాలు కాగా, కోతి లక్ష్మి, కవితలు చికిత్సనిమిత్తం 108 వాహనం ద్వారా కరీంనగర్‌కు తరలిస్తుండగా మృతి చెందారు. తీవ్ర గాయాలైన వారిని ప్రైవేటు వాహనంలో చికిత్సనిమిత్తం తరలించారు. తహశీల్దార్ వెంకటరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ నీతూ ప్రసాద్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మానకొండూర్ జడ్పీటిసి ఎడ్ల సుగుణాకర్ ఉన్నారు.