ఆంధ్రప్రదేశ్‌

మంత్రులకు మళ్లీ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ జూన్ 1: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మళ్లీ పరీక్ష ఎదురుకానుంది. మంత్రుల పనితీరు, సామర్థ్యం, ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న తీరుపై గతంలో సర్వేలు నిర్వహించి, ర్యాంకులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ మరో సర్వే చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాను మళ్లీ ఈ నెలలో మంత్రుల పనితీరుపై కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకుంటున్నానని వెల్లడించారు. మొత్తం 136 అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ఇస్తున్నట్లు వివరించారు. ఇంతకుముందు చేసిన ఈ సర్వేపై పార్టీలో, మీడియాలో విమర్శలొచ్చిన విషయాన్ని కొందరు మంత్రులు బాబు దృష్టికి తీసుకువెళ్లారు. దాన్ని పట్టించుకోని బాబు ఇదంతా మంత్రులు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు మాత్రమేనని, దీనికి అంతా సహకరించాలన్నారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికయిన కేంద్రమంత్రి సురేష్‌ప్రభును బాబు ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. సురేష్‌ప్రభు వ్యక్తిగతంగా మంచి మనిషి. మంచి ఆలోచనలున్న నాయకుడు. దానికంటే మించి సింప్లిసిటీ మెయింటెయిన్ చేస్తారు. ఆయన్ను చూసి అంతా నేర్చుకోవాలన్నారు. ఎన్డీఏ ఉన్నప్పుడు నదుల అనుసంధానంపై వేసిన టాస్క్ఫోర్స్ కమిటీలో తామిద్దరం కలిసి పనిచేశామని, అప్పటినుంచే ఆయన సింప్లిసిటీ తనకు ముచ్చటేసిందని మంత్రులకు వివరించారు.