తెలంగాణ

థర్మల్ ప్లాంట్‌కు ప్రజామోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దామరచర్ల, మే 31: రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు ఆమోదం తెలిపారు. మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని మండలంలోని వీర్లపాలెం గ్రామ శివారులో పైలాన్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అధ్యక్షత వహించి సమావేశ ప్రారంభ ఉపన్యాసాన్ని చేశారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు థర్మల్ పవర్‌ప్లాంట్‌పై తమ అభిప్రాయాలను సభాముఖంగా తెలియచేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం థర్మల్ పవర్‌ప్లాంట్ ఇన్‌చార్జి సిఎండి రాధాకృష్ణ ప్రసంగిస్తూ 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే థర్మల్ పవర్‌ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కొత్తగూడెంలో 800, మణుగూరులో 1020, దామరచర్లలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికలు సిద్ధంచేశారని అన్నారు. పవర్‌ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, ఈ పవర్‌ప్లాంట్‌పై తమ అభిప్రాయాలను తెలిపాలని ప్రజలను కోరారు. అనంతరం పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటయితే ఈ ప్రాంతం దేశంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, దీనివలన కొంతమందికి ఇబ్బందులు కలిగినప్పటికీ ఎక్కువ మందికి ఉపయోగం ఉన్నందున ముఖ్యమంత్రి దీని నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారని అందుకు వారు కృతఙ్ఞతలు తెలిపారు.
థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టే ప్రాంతంలో ఉన్న మోదుగులతండా, కపూరతండాలను ఇక్కడి నుండి తరలించేందుకు 13 ఎకరాల 20 గుంటలను భూసేకరణ చేపట్టారని, అన్ని రకాల వసతులను ఆ ప్రాంతంలో నిర్వాసితులకు గృహాలు నిర్మిస్తారని అన్నారు. స్థానికులకు ఈ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగ అవకాశాలు తప్పక కల్పించాలని వారు జెన్‌కో అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను, ఆడియో, వీడియో రికార్డులను చేపట్టారు. సమావేశం ముగింపు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తం 54మంది వక్తలు మాట్లాడారని, 10వేల మంది రాతపూర్వకంగా తమ విన్నపాలను తెలిపారని, ప్రతి ఒక్కరు థర్మల్ పవర్‌ప్లాంట్‌కు నిర్మాణానికి అనుకూలంగానే ప్రసంగించడం, అభిప్రాయాలు తెలపడం అభినందనీయమని అన్నారు. తాళ్లవీరప్పగూడెం గ్రామంలో కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరగలేదని ఇట్టి విషయంలో ఎకరాకు చెల్లింపు ధర విషయంలో వ్యత్యాసం ఉన్నందున అది పూర్తయిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

భారీ బందోబస్తు
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రజాభిప్రాయం మంగళవారం చేపట్టగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును చేపట్టారు. తాళ్లవీరప్పగూడెం గ్రామం నుండి పైలాన్ వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే వాహనాలను లోనికి తరలించారు. ముగ్గురు డిఎస్‌పిలు, 10మంది సిఐలు, 20మంది ఎస్‌ఐలు, 300మంది పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక స్కానింగ్‌లో సమావేశంలో లోపలికి అనుమతించారు.

చిత్రం యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణలో హాజరైన ప్రజలు.