తెలంగాణ

ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరసనల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, మే 31: మల్లన్నసాగర్ భూనిర్వాసిత గ్రామమైన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో గ్రామస్థులంతా పంచాయతీ కార్యాలయం ముందు మంగళవారం బైఠాయించి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. 2013 చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్త్తూ రిలే దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి గ్రామ చావిడి వద్ద ఆట, పాటలతో నిరసనలు తెలిపి వంటావార్పు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచే చౌరస్తా వద్దకు చేరుకున్న మహిళలు, వృద్ధులు కంటతడి పెడుతూ తమ బతుకులు చిందరవందర చేసే ప్రాజెక్టు నిర్మించొద్దని, భూములు అప్పగించేది లేదన్నారు. గ్రామంలోని కొందరు తమను కాదని దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు చేశారని, వారు వాటిని ఇప్పటికైనా రద్దు చేసుకొని అందరికీ క్షమాపణ చెప్పాలన్నారు.
2013 చట్టాన్ని అమలు చేయాలని కోరితే చేస్తామని కలెక్టర్ గ్రామస్థులకు ఇచ్చిన హామీని కాదని తహశీల్దార్ చాటుగా 123 జిఓ ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తారని వారు ప్రశ్నించారు. సర్పంచ్ కుమారుడు మోహన్‌రావు దీక్ష చేపట్టగా పిఎసిఎస్ చైర్మన్ మల్లేశం, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి, నేతలు పరిపూర్ణాచారి, శ్రీనివాస్, భాస్కర్, కిష్టయ్య సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాసితులకు భూమికి బదులు భూమితో పాటు అన్ని వసతులతో కూడిన గ్రామాన్ని నిర్మించి ఇతర పరిహారాలను చెల్లించాలని లేకుంటే ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించాలన్నారు. శాంతియుతంగా అహింసా మార్గంలో న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని, సంఘటితంగా ఉండాలని కోరారు. పార్టీలకు అతీతంగా ముంపు గ్రామస్తులంతా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధం కావాలన్నారు. కాగా గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా తొగుట సిఐ రామాంజనేయులు, ఎస్‌ఐ కృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిత్రం పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్థులు