తెలంగాణ

చేనేత కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, మే 31: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ పి.శీనయ్య తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన దొంత అంజయ్య (61) చేనేత వృత్తిని జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో సొంతిల్లు కూడా లేని అంజయ్య చేనేత వృత్తినే నమ్ముకుని ఇద్దరు కుమార్తెల వివాహాలు చేశాడు. ఇద్దరు కుమారులను చదివిస్తున్నాడు. చేనేత వృత్తితో కుటుంబ అవసరాలు తీరకపోవడంతో పాటు కుమార్తెల వివాహాలకోసం, కొడుకుల చదువుల కోసం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న చెరువులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువువైపు వెళ్లి వెతకడంతో చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ శవమై కనిపించాడు. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు బొంత అంజయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేనేత నాయకులు, కార్మికులు మృతదేహంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లనే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం అంజయ్య మృతదేహంతో రాస్తారోకో చేస్తున్న చేనేత కార్మిక సంఘం నాయకులు