తెలంగాణ

అదుపులోనే శాంతిభద్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్‌శర్మ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే మావోల ప్రాబల్యం పెరుగుతోందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని అపోహలను దరిచేరనీయకుండా పోలీస్ యంత్రాంగం మావోల ప్రాబల్యం గల ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగిందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను సంస్కరించిందని, పోలీసు శాఖకు కావలసినవన్నీ సమకూర్చగలిగిందన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, పోలీసు విభాగం శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన తరువాత మహిళలపై వేధింపు తగ్గాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. తెలంగాణలో చారిత్రక గోదావరి పుష్కరాలు ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. త్వరలో జరిగే కృష్ణా పుష్కరాలకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు.

చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డిజిపి అనురాగ్‌శర్మ