తెలంగాణ

కోమటిరెడ్డి కాంగ్రెస్‌ను వీడితేనే మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీని వీడితే పార్టీకిగానీ, జిల్లాకు గానీ నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. కోమటిరెడ్డి పార్టీలో ఉంటేనే నష్టమని అన్నారు. జిల్లాలోని పార్టీ ముఖ్యులకు ఫోన్లు చేసి తన వెంట రావాల్సిందిగా కోరుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. కాగా కోమటిరెడ్డి వెంట వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. రెండేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసింది, సాధించింది ఏమీ లేదని పాల్వాయి విమర్శించారు. 60 ఏళ్ళలో కాంగ్రెస్ చేయలేనిది తాము ఈ రెండేళ్లలో చేశామని తెరాస నాయకులు చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఏమి చేశారో చెప్పాలని అన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
రాష్ట్రంలో అవినీతిని రూపుమాపినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పుకోవడం సిగ్గు చేటని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. మిషన్ భగీరథ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లలో ఒక్క మెగా సంస్థకు, నవయుగ సంస్ధలకే 20 వేల కోట్ల రూపాయల పనులు ఎలా దక్కుతాయని వారు ప్రశ్నించారు.