తెలంగాణ

త్వరలోనే ‘అమ్మఒడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31 : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తల్లీబిడ్డలను ఆసుపత్రుల నుండి ఇళ్లకు పంపించేందుకు ‘అమ్మఒడి’ పేరుతో ఒకరకమైన వాహనం, పేదలు ఎవరైనా ఆసుపత్రుల్లో మరణిస్తే ఆ శవాలను వారి వారి ఇళ్లకు తరలించేందుకు ‘ఫ్రీ హార్సే సర్వీస్’ పేరుతో మరోరకమైన వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. రాష్ట్ర సచివాలయంలో ఈ రెండు రకాల వాహనాలను వైద్యశాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతి అయిన తర్వాత తల్లీ, బిడ్డలను వారి ఇళ్లకు చేర్చేందుకు అమ్మఒడి పేరుతో 102 నెంబర్ (108 తరహాలో) కలిగిన వాహనాలను రూపొందించారు. తొలిదశలో 40 వాహనాలు సిద్ధం చేశారు. ఆసుపత్రుల్లో ప్రసూతి తర్వాత తల్లీబిడ్డలను ఇళ్లకు ఉచితంగా తీసుకువెళ్లేందుకు ఈ వాహనాలను వాడతారు. అలాగే వివిధ కారణాల వల్ల ఆసుపత్రుల్లో పేదలు ఎవరైనా మరణిస్తే ఆ శవాలను ఇళ్లకు తరలించేందుకు ఆయా కుటుంబాల వారు ఇక్కట్లకు గురవుతున్నారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ‘ఫ్రీ హార్సే సర్వీస్’ పేరుతో 50 వాహనాలను తయారు చేశామని ఆయన వివరించారు. రెండు రకాల వాహనాలను పరిశీలించిన మంత్రి, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ ఎం. రమణి, ఆరోగ్యశ్రీ సిఇఓ డాక్టర్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.