తెలంగాణ

మహిళా కళాశాలల్లో సిసి కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 28: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మహిళా కళాశాలల్లో జూన్ 30వ తేదీ వరకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా విద్యా అభివృద్ధిపై సంబంధిత శాఖ అధికారులతో రెవెన్యూ మీటింగ్ హల్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలిసి డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉందని, ఇలాగైతే జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని అందుకే ప్రజాప్రతినిధులు అధికారుల సహకారం ఎంతో అవసరమన్నారు. 250 రెసిడెన్షియల్ పాఠశాలలను ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేస్తే ఈ జిల్లాపై ఉన్న అభిమానంతో ఆయన దాదాపు అన్ని రకాలకు సంబంధించిన 31 రెసిడెన్షియల్ పాఠశాలలను మహబూబ్‌నగర్‌కు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలనే తపనతో తెలంగాణలో విద్యారంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కళాశాల భవనాలు, పాఠశాలల భవనాల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదని, గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుందని తక్షణమే సంబంధిత ఎఇని కలెక్టర్ సరెండర్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా విద్యారంగంపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అప్పడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా డిఇఓ రేపటి నుండే నియోజకవర్గాల స్థాయి సమావేశాలు నిర్వహించి, సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యేను భాగస్వాములను చేయాలని సూచించారు. పాఠశాలల్లో వౌళిక వసతుల కల్పనకై రూ.100కోట్ల నిధులను కేటాయిస్తామని వెల్లడించారు. అయితే సమీక్ష సమావేశంలో పలు అంశాలు చర్చకు రాగా సర్వశిక్షా అభియాన్ ఏఇ తన పనుల పురోగతిపై నిర్లక్ష్యం వహించడంతో డిప్యూటీ సిఎం గాడిదలను కాస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఇతనిని సరెండర్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా బాగుపడాలంటే విద్యాభివృద్ద్ధి జరగాలని పెర్కొన్నారు.

చిత్రం మహబూబ్‌నగర్ జిల్లా విద్యాబివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో
మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి