తెలంగాణ

పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా తిరుపతయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: తెలంగాణ పశుసంవర్థక శాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వై.తిరుపతయ్యకు రిటైర్‌మెంట్ తర్వాత లక్క్ఛీన్స్ వస్తోంది. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. ఒకవైపు పదవీవరమణకు సంబంధించి శనివారం జీఓ (జిఓ ఆర్‌టి నెంబర్ 68) వెలువడగానే, ఇదే రోజు ఆయనను ఇదే శాఖలో అడ్‌హాక్ విధానంలో డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు మరో ఉత్తర్వు (జిఓ ఎంఎస్ నెంబర్ 11) జారీ అయింది. ఆయనకు 80,930-1,10,850 రూపాయల స్కేల్‌తో పాటు ఇతర అలవెన్స్‌లను ఇవ్వాలని నిర్ణయించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ పదవితో పాటు తెలంగాణ రాష్ట్ర లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ)గా కూడా అదనపు బాధ్యతలను తిరుపతయ్యకు అప్పగిస్తున్నారు. 15 రోజుల్లోగా తిరుపతయ్య కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు గడువుగా నిర్ణయించారు.