తెలంగాణ

ఎసిబి వలలో వెటర్నరీ డాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్తాబాద్, మే 28: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లో శనివారం ఎసిబి యంత్రాంగానికి ఎల్లారెడ్డిపేట వెటర్నరీ డాక్టర్ చంద శ్రావణ్‌కుమార్ పట్టుబడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన గొర్రెల పెంపకందారు చెరుకు లచ్చయ్య కుమారుడు చెరుకు శ్రీశైలం చేతులమీదుగా రూ.15వేల లంచం తీసుకొంటుండగా పశువైద్యాధికారిని పట్టుకొన్నారు. ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్, బాధిత గొర్రెల పెంపకందారు శ్రీశైలం కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. గొర్రెల పెంపకందారు శ్రీశైలం సహకార బ్యాంకులో దరఖాస్తు చేసిన 6లక్షల రుణం గొర్రెల పెంపకం యూనిట్ మంజూరైంది. సదరు గొర్రెల యూనిట్ ఏర్పాటుకై ఎంపిక చేసిన ఆరోగ్యకరమైన గొర్రెల కొనుగోలుకు సిఫార్సు చేస్తున్నట్లుగా పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉండగా, గొర్రెల పెంపకందారు లచ్చయ్య, పశువైద్యాధికారిని సంప్రదించాడు. వెటర్నరీ డాక్టర్ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి 20వేలు లంచం అడిగాడని, ప్రాధేయపడగా చివరికి 15వేలకు ఒప్పందం జరిగిందని బాధితుడు లచ్చయ్య, అతని కొడుకు శ్రీశైలం, ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎసిబి డిఎస్పీ స్పందించారు. ఎసిబి డిఎస్పీ, వల పన్ని ముస్తాబాద్‌లో పశువైద్యాధికారికి చెందిన టివిఎస్ షోరూమ్‌లో బాధితుడు శ్రీశైలం వెటర్నరీ డాక్టర్‌కు లంచం ఇస్తుండగా నగదుతో పాటు వెటర్నరీ డాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.

చిత్రం ఎసిబికి చిక్కిన శ్రావణ్‌కుమార్