తెలంగాణ

జిసిసి ద్వారా రూ. 175 కోట్ల వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: గిరిజన సహకార సంస్థ ద్వారా ఈ సంవత్సరం 175 కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) కార్యకలాపాలపై సచివాలయంలో శనివారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. గిరిజన తం డాలు, గిరిజన గూడేంలలోని గిరిజనులకు గిరిజన సహకార సంస్థ ద్వారా ఔషధాలు అందించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. గిరిజన గూడేలలో అనేక మంది గిరిజనులు వివిధ రోగాలకు గురవుతున్నారని, అందువల్ల వారికి మందులు అందుబాటులో ఉండేందుకు జిసిసి దుకాణాల్లో మందులను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక చోట వీటిని విక్రయిస్తామన్నారు.
ఇలా ఉండగా గిరిజన రైతులకు సహకరించేందుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కూడా జిసిసిల ద్వారా విక్రయించే ఏర్పాటు చేశామని మంత్రి చందూలాల్ తెలిపారు. కల్తీ లేకుండా నిత్యావసర సరకులను ఎస్‌టిలకు అందించేందుకు సూపర్‌మార్కెట్లను ఏర్పాటు చేయబోతున్నామని, 75 రకాల సరకులను వీటి ద్వారా విక్రయిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలో కోల్డ్‌స్టోరేజ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జిసిసిలకు అవసరమైన గోదాములను నిర్మిస్తామని, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ఇందుకోసం వాడతామన్నారు. గిరిజనులు సేకరించే చింతపండు, తేనె, కుంకుడు గింజలు, విషముష్టి గింజలను కొనుగోలు చేస్తామని, దీని ద్వారా ఎస్‌టిలకు ఆర్థికంగా లబ్ధి జరుగుతుందన్నారు. జిసిసి ద్వారా కేవలం గిరిజన విద్యార్థుల వసతి గృహాలకే కాకుండా ఇతర హాస్టళ్లకు కూడా సరుకులను సరఫరా చేస్తామన్నారు.