తెలంగాణ

సెంట్రల్ యూనివర్శిటీలో ‘వెలివాడ’ టెంట్లు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో విద్యార్థులు శనివారం మరోసారి ఆందోళనకు దిగారు. యూనివర్శిటీలోని వెలివాడలో శుక్రవారం రాత్రి టెంట్లు, రోహిత్ వేముల, అంబేద్కర్ చిత్రపటాలను సెక్యూరిటీ సిబ్బంది తొలగించారని పేర్కొంటూ విద్యార్థులు ప్రధాన గేటు ముందు నిరసనకు దిగారు.
రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన విసి అప్పారావును కేంద్ర ప్రభుత్వం నేటికీ తొలగించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. యూనివర్శిటీలో దళిత విద్యార్థులను అణచివేసే విధంగా విసి వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. వెలివాడలో రాత్రికి రాత్రి టెంట్‌ను, రోహిత్, అంబేద్కర్ చిత్రపటాలను తొలగించాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తూ, విసిపై చర్యలు తీసుకునేంత వరకూ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు.
సెంట్రల్ యూనివర్శిటీని ఆర్‌ఎస్‌ఎస్ క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని యూనివర్శిటీ జాక్ నాయకుడు ప్రశాంత్ ఆరోపించారు.
విద్యార్థుల ఆందోళనను అణచివేసి, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల మధ్య అంతరాన్ని పెంచేందుకు విసి అప్పారావు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. విసి తన వైఖరి మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని జాక్ నేతలు మున్నా, హర్పిత, అశోక్, చరణ్ తదితరులు పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకుని విద్యార్థి నాయకులు ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగారు.