తెలంగాణ

జూరాలకు చేరిన 1 టిఎంసి కృష్ణా జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28:నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు శనివారం ఉదయానికి ఒక టిఎంసి కృష్ణా జలాలు చేరుకున్నాయి. గత వారం రోజుల నుంచి నీటివిడుదల ప్రారంభం కాగా, వారం రోజుల్లో ఒక టిఎంసి నీరు పూర్తయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి అవసరాల కోసం కర్నాటక ఒక టిఎంసి నీటిని విడుదల చేయడానికి ఈనెల 20న అంగీకరించింది. అదే రోజు నీటివిడుదలకు అవసరం అయిన చర్యలు తీసుకుంది. శనివారం నాటికి మొత్తం ఒక టిఎంసి నీరు జూరాలకు చేరుకుంది. ఒక టిఎంసి నీరు చేరుకున్నట్టు మహబూబ్‌నగర్ ఇరిగేషన్ సిఇ ఖగేందర్‌రావు తెలిపారు. చెప్పినట్టుగా ఒక టిఎంసి నీటి విడుదల పూర్తయినట్టు బెంగళూరులో కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎబి పాటిల్ తెలిపారు. తొలుత మూడు టిఎంసిల నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బెంగళూరు వెళ్లి కర్నాటక ప్రభుత్వాన్ని కోరారు. కర్నాటక మాత్రం ఒక టిఎంసి నీటిని విడుదల చేసేందుకు అంగీకరించింది.
.