తెలంగాణ

సాంబశివుడి హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించని కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 23: మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దివంగత కొనపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడి హత్య కేసులో నరుూం మూఠా సభ్యులపై నల్లగొండ జిల్లా పోలీసులు పెట్టిన కేసు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా భువనగిరి 5వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.ఎ.రజాక్ కొట్టివేశారు. ఒకరోజు ఆలస్యంగా బుధవారం తెలిసిన తీర్పు వివరాల మేరకు సాంబశివుడి హత్య కేసును ఎదుర్కొంటున్న 12మంది నిందితుల్లో ఎ-2నుండి ఎ-11 నిందితులపై పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది. కేసులోని నిందితులు చిలకరాజు సురేష్, చాకటోళ్ల అమర్, గుండు రాకేష్, దర్శనపు శ్రీకాంత్, మాదగోని శ్రీ్ధర్‌గౌడ్ , చిలకరాజు అరుణ్, రాజుల నరేష్, ఎర్ర కృష్ణ, పాశం లింగం, వీరమళ్ల రవిలపై పోలీసులు చేసిన నేరారోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాలు సమర్పించని కారణంగా కేసు కొట్టి వేశారు. కాగా ఎ-1నిందితుడిగా ఉన్న ఎండి.నరుూమొద్దీన్, ఎ-12 నిందితుడు రహీమ్ పరారీలో ఉన్నందున వారిని కోర్టు నిర్ధోషులుగా ప్రకటించలేదు. వారిపై కేసు కొనసాగనుంది. కాగా, సాంబశివుడి హత్య కేసు కోర్టులో కొట్టివేయడంతో మరోసారి పోలీసుల వ్యవహారశైలి ఈ కేసులో చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి పోలీసులకు లొంగిపోయి టిఆర్‌ఎస్ నేతగా చురుకుగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న సాంబశివుడు 2011 మార్చి 26న దుండగుల దాడిలో హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్తున్న సాంబశివుడిపై రెండుకార్లలోని వచ్చిన దుండుగులు దాడి చేసి హత్య చేశారు. అతడి హత్య ప్రత్యర్థి నరుూం మూఠా పనేననంటూ అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నరుూం, అతడి అనుచరులు మొత్తం 12మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నరుూం, రహీంలను మినహా మిగతా 10మందిని పోలీసులు రెండు దఫాలుగా అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు నరుూంను ఇప్పటిదాకా పోలీసులు అరెస్టు చేయలేదు. సాంబశివుడిని నరుూం ముఠాతో పోలీసులే హత్య చేయించారని అప్పట్లో సాంబశివుడి సోదరుడు రాములు ఆరోపించారు. పోలీసులు, నరుూం కలిసి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటు రాములు ఆరోపించారు. అసలు తన అన్న హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారు నిజమైన హంతకులు కాదంటూ వాదించాడు. పోలీసులు తగిన సాక్ష్యాలు చూపడంలో విఫలమవ్వగా కేసు కొట్టివేయడం చర్చనీయాంశమైంది. కాగా, పోలీసులపై, నరుూంపై ఆరోపణలు చేసిన సాంబశివుడి సోదరుడు మాజీ మావోయిస్టు రాములు సైతం గత ఏడాది నరుూం ముఠా సభ్యుల కాల్పుల్లో హతమయ్యాడు. ఈ కేసులో కూడా నరుూంతో పాటు 16మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు విచారణ సాగుతుండడం ఈ సందర్భంగా గమనార్హం.