తెలంగాణ

బిసి, ఓసి పేదలకూ కల్యాణలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 23: కల్యాణలక్ష్మి పథకాన్ని బిసిలతో పాటు అగ్రవర్ణాల పేదలకు వర్తింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గతంలో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే వర్తింప జేశారన్నారు. ఇప్పుడు పేద యువతులందరికీ కల్యాణలక్ష్మి పథకం కింద 51 వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఎల్లుపల్లి, బక్రిచెప్యాలలో సిసి రోడ్ల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు కింద కాల్వల ద్వారా నీరు మళ్లించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇందుకోసం 38 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి నీటితో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారుతుందని, రైతులు తొందరపడి భూములు అమ్ముకోవద్దన్నారు. త్వరలో సిద్దిపేట జిల్లాగా మారుతుందని, రైలుమార్గం కూడా వస్తుందని, సాగునీరు కూడా వస్తుండడంతో భూములకు రెక్కలు వస్తాయన్నారు. రైతుల భూములు బంగారంగా మారే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, ప్రతి గ్రామానికి ఎటిడబ్ల్యు కార్డు ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామన్నారు. విద్యుత్ పొదుపుకోసం ఎల్‌ఇడి బల్బులు సబ్సిడీపై అందిస్తామన్నారు.

నరుూం ముఠాపై కేసు కొట్టివేత!

300 విలువైన బల్బును 75 రూ.కే అందిస్తామని, దీంతో విద్యుత్ ఆదాతో పాటు బిల్లులు తక్కువగా వస్తాయన్నారు. ఇంకుడుగుంతల నిర్మాణంలో ఇబ్రహీంపూర్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇంటా ఇంకుడుగుంతల నిర్మాణం, వేప మొక్కలు పెంచాలన్నారు. ఇంకుడుగుంతల నిర్మాణానికి 4100రూ. ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇంకుడుగుంతల నిర్మాణంతో దోమలు, ఈగలు నివారించొచ్చని, దీంతో వ్యాధులు కూడా రావన్నారు. గ్రామంలో 24 గం. నీరు సరఫరా చేసేలా కొత్త పథకం తీసుకొస్తున్నామన్నారు. ఇందుకోసం 40 లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికి డెస్కులు అందిస్తున్నట్లు తెలిపారు. పొలాల చుట్టూ క్రంచ్ చేసుకోవడం వల్ల భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉపాధిహామీ కింద ఎకరానికి 30వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.
మూడు నెలల్లో సబ్‌స్టేషన్లు పూర్తి చేస్తాం
రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నాంచారుపల్లిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంకు చిన్నగుండవెళ్లి, నాంచారుపల్లి, వెల్కటూర్‌కు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, వీటిని మూడు నెలల్లో పూర్తి చేసి రైతులకు వానాకాలం వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. నాంచారుపల్లిలో మహిళా భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మిస్తామన్నారు. యాదవ, గంగిరెద్దుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేస్తానన్నారు. రాజీవ్ రహదారి-నాంచారుపల్లి రోడ్డుకు 46 లక్షలు మంజూరు చేస్తానన్నారు. ఎల్లుపల్లి - బక్రిచెప్యాలకు 90 లక్షలతో తారురోడ్డు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ సదాశివరెడ్డి, డిఇ శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసులు, ఓఎస్డీ సమ్మిరెడ్డి, సర్పంచులు అనిత, బాలకిషన్, శ్రీనివాస్, ఎంపిటిసి గాలమ్మ పాల్గొన్నారు.