తెలంగాణ

పెళ్లింట విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 23: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ ట్యాంకు తండాలో బుధవారం ఒక పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ బుజ్జి (35) తన తమ్ముడు రవి పెళ్లి జరుగుతుండగా స్పీకర్‌లో ఒకరిని రమ్మంటూ పిలిచేందుకు స్పీకర్ పట్టుకుని మాట్లాడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఇంట్లో ఒకేసారి విషాదం చోటు చేసుకుంది. మృతురాలికి భర్త నాగు, ఒక కుమారుడు శాంతి, నాగేష్ ఉన్నారు. తండాలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, ఎర్త్ వస్తుందని గ్రామస్థులు విద్యుత్ అధికారులు, లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్‌కు చెప్పిన పట్టించుకోలేదని పంచాయతీ సర్పంచ్ డి.బద్యానాయక్, నాయకులు ఎం.రవినాయక్, సిపిఎం నాయకులు పి.రామ్మూర్తి ఆరోపించారు. రమావత్ బుజ్జి మరణించిన విషయాన్ని తెలుసుకున్న తండా వాసులు ఇది ముమ్మాటికీ విద్యుత్ అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగిందంటూ వెంటనే మృతదేహాన్ని మిర్యాలగూడ పట్టణంలోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయానికి తీసుకువచ్చి ధర్నా జరిపారు. సుమారు 3 గంటల పాటు ధర్నా జరిపారు. అన్యాయంగా నిండు ప్రాణానికి విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే బలైందని వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టూటౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.