ఆంధ్రప్రదేశ్‌

హుండీ ఆదాయం పెరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: విజయవాడలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ సిబ్బంది పనిచేయకపోయినా ఆదాయం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఆశాఖ ఆదాయం 27 శాతం పెరిగిందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆలయాల్లో పవిత్రమై హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. తప్పులు చేసిన వారు, బాధల్లో ఉన్న వారు ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళుతున్నారు. తద్వారా హుండీ ఆదాయం పెరుగుతుంది. తప్పులు ఎక్కువ చేసిన వారు హుండీల్లో ఎక్కువ మొత్తాన్ని వేస్తున్నారు. దీని వలన ఆదాయం మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. దీక్షల పేరుతో 40 రోజులపాటు కొంతమంది మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీనివలన ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించడం చేయడం గమనార్హం.
తొలిరోజు ఎపి పిజి ఈసెట్-2016 ప్రశాంతం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మే 25: ఎపి పిజి ఈసెట్-2016 తొలి రోజైన బుధవారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో 6 రీజనల్ సెంటర్ల పరిధిలో ఏర్పాటుచేసిన 79 ప్రవేశ పరీక్షా కేంద్రాల్లో పిజి ఈసెట్‌ను నిర్వహించారు. ఈ నెల 26, 27 తేదీల్లో రీజనల్ సెంటర్ల పరిధిలో మిగిలిన పరీక్షలను నిర్వహిస్తారు. కాకినాడ జెఎన్‌టియు పర్యవేక్షణలో గత రెండేళ్లుగా ఎపి పిజిఈసెట్‌ను నిర్వహిస్తున్నారు. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, అనంతపురం రీజనల్ సెంటర్ల పరిధిలో తొలి రోజు ప్రవేశ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్టు ఎపి పిజిఈసెట్-2016 కన్వీనర్, జెఎన్‌టియుకె రిజిస్ట్రార్ ఆచార్య జివిఆర్ ప్రసాదరాజు ‘ఆంధ్రభూమి ప్రతినిధి‘కి తెలిపారు. పిజి ఈసెట్‌లో జియో ఇంజనీరింగ్, జియో ఇన్‌ఫర్మేటిక్ విభాగానికి సంబంధించి 79 మంది దరఖాస్తు చేసుకున్నారు. 47 మంది పరీక్షకు హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు. 59.05 శాతం హాజరు నమోదయ్యింది.
ఫార్మశీ విభాగానికి సంబంధించి 6165 మంది దరఖాస్తు చేసుకోగా 338 మంది గైర్హాజరు కాగా 5827 మంది హాజరయ్యారు. 94.05 శాతం హాజరు నమోదయ్యింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 4818 మంది దరఖాస్తు చేసుకోగా 724మంది గైర్హాజరు కాగా, 4092 మంది హాజరయ్యారు. 83.94 శాతం హాజరు నమోదయ్యింది. ఆయా రీజనల్ సెంటర్ల పరిధిలో 26,27 తేదీల్లో మిగిలిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ చెప్పారు. గురువారం ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, బయోటెక్నాలజీ అండ్ ఏరోస్పేస్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫుడ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్ధులు ప్రవేశ పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.