తెలంగాణ

భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: రాష్ట్రంలో ఆరు జిల్లాల ఎస్సీలకు స్థానం చలనంతోపాటు పలువురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ సిఎస్ రాజీవ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీగా ఎన్ ప్రకాశ్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా విక్రమ్ జీత్ దుగ్గల్, రంగారెడ్డి జిల్లా ఎస్పీగా బి నవీన్‌కుమార్, నిజామాబాద్ ఎస్పీగా విశ్వప్రసాద్, మెదక్ ఎస్పీగా ఎస్ చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ ఎస్పీగా ఉన్న బడుగుల సుమతిని హైదరాబాద్ నార్త్ జోన్ డిసిపిగా, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఆడిషనల్ ఎస్పీగా ఉన్న సుప్రీత్ సింగ్‌ను శంషాబాద్ డిసిపిగా, హైదరాబాద్ డిసిపిగా అవినాశ్ మహంతి, హైదరాబాద్ రేంజి డిఐజిగా అకున్ సభర్వాల్‌ను నియమించారు. పదోన్నతులు పొందినవారిలో సీనియర్ ఐపిఎస్ అధికారి, అడిషనల్ డిజిగా ఉన్న తేజ్‌దీప్ కౌర్, సుదీప్ లక్టాకియాకు డిజిగా పదోన్నతి కల్పించినట్టు పేర్కొన్నారు. అలాగే రాజీవ్ రతన్‌కు అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించి ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ మేనేజిమెంట్ డైరెక్టర్‌గా నియమించినట్టు పేర్కొన్నారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న అంజన్ కుమార్‌ను ఆడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా (శాంతి భద్రతలు) నియమించి, ఈయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించారు. అంతకుముందు సందీప్ శాండిల్య నిర్వహించిన ఐజిపి పర్సనల్ పోస్టులో వివి శ్రీనివాస్‌ను నియమించినట్టు పేర్కొన్నారు. డిఐజి హోదాలో ఉన్న ఆర్‌బి నాయక్, టి మురళీకృష్ణ, ఎం శివప్రసాద్‌కు ఐజిపిలుగా పదోన్నతి కల్పించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.