తెలంగాణ

మానుకోట నుంచి కాకినాడకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 17: అధికారుల అండతో.. అధికార పార్టీ నాయకుల భరోసాతో అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన వరంగల్ జిల్లా మానుకోటలో మరో సరికొత్త అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. మానుకోట పట్టణంలోని ఓ రైస్‌మిల్లు కేంద్రంగా తప్పుడు వేబిల్‌లు సృష్టించి పేదలకు అందాల్సిన బియ్యాన్ని యధేచ్ఛగా మానుకోట నుండి కాకినాడకు తరలిస్తున్న బడా అక్రమ వ్యాపారం విజిలెన్సు అధికారుల తనిఖీలో పట్టుబడింది.
ప్రతి రోజు రూ.5లక్షలకు పైగా అక్రమ రవాణాతో వెనుకేస్తున్న వ్యాపారులు, ఆ అక్రమ సొత్తులో కొంత భాగాన్ని ప్రశ్నించే వర్గాలపై విసిరి మానుకోటలో కళ్లున్నా చూడలేని.. నోరున్నా మాట్లాడలేని పరిస్థితిని కల్పించారు. అక్రమ రవాణా దందాపై పూర్తి నివేదికను పాత్రధారులు, సూత్ర ధారులతో సహా, సివిల్ సప్లై అధికారులు బట్టబయలు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం అధికార యంత్రాంగం అడుగు ముందుకు వేయలేకపోతుంది. ప్రతి నెల పేదల నోటికాడి బియ్యాన్ని కోట్లుగా మార్చుకుంటున్న ఈ అక్రమ దందా వ్యవహారం ఇలా ఉంది...
రైస్‌మిల్ వేబిల్‌తో వెలుగులోకి...
మానుకోట కేంద్రంగా రేషన్‌బియ్యం అక్రమ తరలింపు యదేచ్ఛగా సాగుతుందనే అంశాన్ని గ్రహించిన అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి గత కొద్ది నెలల క్రితం నుండి అక్రమవ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. దాదాపు వ్యాపారులు తమ దందా మూసివేసుకునే పరిస్థితిని సృష్టించారు. తనిఖీలను కట్టడి చేసేందుకు రకరకాల ఒత్తిడ్లు తెచ్చిన అక్రమ వ్యాపారులు ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు. దీంతో వే బిల్లుల పేరిట మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమ మిల్లులో బియ్యం నూర్పుడు సమయంలో వచ్చిన రా బియ్యాన్ని వే బిల్లు ద్వారా ఏ ప్రాంతానికైనా పంపించే అవకాశం ఉండడంతో, ఈ ఆన్‌లైన్ అవకాశాన్ని అదునుగా తీసుకున్నారు. మానుకోటలోని మురళీకృష్ణ రైస్‌మిల్‌నుండి జనవరి నుండి ఇప్పటి వరకు దాదాపు 500 లారీలకు పైగా బియ్యాన్ని వే బిల్లుల సహాయంతో తరలించారు. పదేపదే తనిఖీల సమయంలో మురళీకృష్ణ రైస్‌మిల్లు వే బిల్లులే కనిపిస్తుండడంతో సివిల్ సప్లై, విజిలెన్సు అధికారులకు అనుమానం కలిగాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఇల్లందులో పట్టుబడ్డ లారీ విషయంలో ఆరా తీయగా, మానుకోట అక్రమ వే బిల్లుల వ్యవహారం బట్టబయలైంది. రా బియ్యం ముసుగులో రేషన్ బియ్యాన్ని యదేచ్ఛగా కాకినాడకు తరలిస్తున్నారని అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు.

నివేదిక సిద్ధం చేసిన
అధికారులు
మానుకోట నుండి కాకినాడకు తప్పుడు వే బిల్లులతో రేషన్‌బియ్యాన్ని రా బియ్యంలా మార్చి రవాణా చేస్తున్న అంశంలో ఇప్పటికే సివిల్ సప్లై, విజిలెన్సు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మురళీకృష్ణ రైస్‌మిల్లు నుండి సరఫరా అయ్యిన బియ్యం నూర్పుడు చేయడానికి సుమారు లక్షల్లో కరెంటు బిల్లు రావల్సి ఉండగా గత నాలుగు నెలలుగా వారు కేవలం వేలల్లోనే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఇంత కరెంటు వినియోగించి, 500కుపైగా రా రైస్ తీసే పరిస్థితి లేకపోవడంతో మానుకోటకు చెందిన సతీష్, రాధాకృష్ణల కనుసన్నల్లోనే ఈ అక్రమదందా సాగుతుందని నిర్ధారణకు వచ్చారు. నివేధిక వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు అందచేసినట్లు సమాచారం. మానుకోట నుండి రోజుకు ఐదు లారీలు అక్రమ వే బిల్లుల అండతో కాకినాడ తీరానికి చేరుకుంటున్నాయి. ఒక్కలారీకి వ్యాపారులకు మిగిలే మొత్తం అన్ని ఖర్చులు పోను రూ.1లక్ష మిగులుతుంది. ఈ విధంగా నెలలో అన్ని ఖర్చులు పోను పేదల నోరుకొట్టి వారి బియ్యంతో వ్యాపారం చేసి కోటి రూపాయలు సంపాదిస్తున్నారని విచారణలో వెలుగుచూసింది. ఇంత జరిగిన చర్యలు తీసుకోవలిసిన జిల్లా స్థాయి అధికారులు మాత్రం మానుకోట అక్రమ దందాపై కొరడా ఝులిపించడంలేదు. కోట్లు కొల్లగొట్టిన తప్పుడు వే బిల్లుల సృష్టికర్తలపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయడంలేదు. కారణాలు ఆరా తీయగా సదరు వ్యాపారులకు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు బలంగా ఉన్నాయని, వారి జోలికి వెలితే స్థానచలనం జరిగే ప్రమాదం కూడా ఉందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. తప్పుడు వే బిల్లుల సృష్టికర్తలపై అధికారులు చర్యలు తీసుకుంటారా.. లేదంటే ఎప్పటిలాగే చూసీచూడనట్లు ఊరుకుంటారా వేచి చూడాలి.

గవర్నర్‌ను కలిసిన కెసిఆర్

హైదరాబాద్, మే 17: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కరవు సహాయంపై కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తరువాత గవర్నర్‌ను కలవడం ఇదే మొదటి సారి. జూన్ రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఒక సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.