తెలంగాణ

రేపు మీకో బిగ్ న్యూస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రెండు రోజుల్లో మీ అందరికీ బిగ్ న్యూస్ అంటూ ఐటి మంత్రి కె తారక రామారావు చేసిన ట్విట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండు రోజుల్లో ఆయన పంచుకునే వార్త ఏమై ఉంటుందా? అన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే మొదలైంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి పెద్ద పరిణామం చోటుచేసుకోనుందని అంటున్నారు. ఆపిల్ సిఇఓ ఈనెల 19న హైదరాబాద్‌కు వస్తున్నారు. హైదరాబాద్‌లో అతి పెద్ద టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. బిగ్ న్యూస్ అంటూ కెటిఆర్ ఊరిస్తోన్న అంశం దీనికి సంబంధించినదే అయివుంటుందనే ఊహాగానాలు ఐటి రంగం నుంచి బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 150 కోట్ల వ్యయంతో 2.5 లక్షల అడుగుల విస్తీర్ణంలో భారీ వ్యాపార కేంద్రాన్ని గూగుల్ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.