తెలంగాణ

పేలుళ్ల వెనుక సంఘ్ హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: మాలేగావ్, అజ్మీర్, మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల వెనుక సంఘ్‌పరివార్ హస్తం ఉన్నదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్‌ఐఎ (నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ)చే దర్యాప్తు జరిపించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) విస్తృత స్థాయి సమావేశానికి దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ నాటి పేలుళ్ల ఘటనపై జరుగుతున్న విచారణను కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయిస్తూ, నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్‌ఐఎచే విచారణ జరిపించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంచి తీవ్రవాదులు, చెడ్డ తీవ్రవాదులు అని చూపించే ప్రయత్నం చేస్తున్నదని ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. తీవ్రవాదుల్లో మంచి, చెడ్డ తీవ్రవాదులుంటారా? అని ఆయన ప్రశ్నించారు.
ఎందుకు నిరూపించలేదు..
నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు బిజెపి కుటిల ప్రయత్నం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. బోఫోర్స్ కుంభకోణం జరిగిందంటూ గగ్గోలు పెట్టినా నిరూపితం కాలేదని అన్నారు. ఆగస్టా కుంభకోణం జరిగిందంటూ ఇప్పుడు నానా యాగీ చేస్తున్నదని ఆయన విమర్శించారు. నాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ ఏదో ‘తేడా’ కనిపిస్తున్నదన్న అనుమానంతో కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించామని, అప్పట్లోనే దానిని బ్లాక్ లిస్టులో పెట్టామని, అప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం చెల్లించిన మొత్తాన్ని వెనక్కి తెప్పించామని ఆయన వివరించారు. ఇటలీ న్యాయస్థానం నెహ్రూ కుటుంబానికి సంబంధం లేదని చెప్పినట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంటులో చెప్పారని ఆయన తెలిపారు. అయినా ప్రధాని మోదీ మాత్రం తన ప్రసంగాల్లో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు. బిజెపి అధికారం చేపట్టి రెండేళ్లయినా ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించి ఎందుకు తేల్చ లేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
రాష్ట్ర సర్కారుపై నిప్పులు..
తెలంగాణ ప్రభుత్వంపైనా ఆయన నిప్పులు చెరిగారు. వడదెబ్బతో దేశ వ్యాప్తంగా అనేక మంది మృత్యువాత పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ మరణించిన వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారే ఉన్నారని ఆయన తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రజలు మంచినీరు లేక అలమటిస్తున్నారని, పశువులకు గ్రాసం లేదని, రైతులు అసంతృప్తిగా ఉన్నారని, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని దిగ్విజయ్ విమర్శించారు. టి.పిసిసి కార్యవర్గం ఏర్పాటైన తర్వాత తొలి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు తాను ఢిల్లీ నుంచి వచ్చానని చెప్పారు. బుధవారం కూడా సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.
నమస్తే తెలంగాణకు దూరం..
టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ఇకమీదట తాము దూరంగా ఉంటామని, ఆ పత్రిక ఏమి రాసుకున్నా, టి టీవీ ఏమి ప్రసారం చేసుకున్నా పట్టించుకోమని అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.