తెలంగాణ

రెసిడెన్షియల్ పాఠశాలలుగా వసతి గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 22: విద్యారంగాన్ని అత్యంత పటిష్టం చేయాలనే ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. వరంగల్ జిల్లా మానుకోట మండలంలోని రెడ్యాల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుండి వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా కెజి టు పిజి ఉచిత విద్యను ప్రభుత్వం అమలు పరిచే దిశగా సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వం ఎన్ని వసతులు కల్పించినప్పటికీ ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే సార్ధకత చేకూరుతుందని, విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని అన్నారు. అనేక పాఠశాలల్లో సక్రమమైన విద్యాబోధన జరగడం లేదని, దీనిని గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వం నిరంతర తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో హాస్టల్ నిద్రలు చేశామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వక వైఖరి అవలంభిస్తుందని, అంతమాత్రాన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేదిలేదన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రి వెంట తెరాస జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, తెరాస నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మార్నేని వెంకన్న, భూ క్య ప్రవీణ్‌నాయక్, ఎండి. ఫరీద్, మాలె నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

వరంగల్ జిల్లా మానుకోట మండలంలోని రెడ్యాల ఆశ్రమ పాఠశాలలో మాట్లాడుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్