తెలంగాణ

పాలేరులో గెలుపు మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: పాలేరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుందని టిఆర్‌ఎస్ అంచన వేస్తుంది. వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్ నిర్వహించిన ‘ఆరా’ సంస్థ కూడా ప్రకటించింది. టిఆర్‌ఎస్ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనకు 50 వేలకు పైగానే మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటం సాధారణం. అయితే ఇందుకు భిన్నంగా పాలేరు ఉప ఎన్నికల్లో పోలింగ్ వ్యవధి ముగిసేసరికి 89.73 శాతం ఓటింగ్ జరిగినట్టు అధికారిక సమాచారం. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి తుది సమాచారం అందాక ఇది 90 శాతానికి చేరుకుంటుందని అంచనా. అయితే గత సాధారణ ఎన్నికల కంటే ఈ సారి జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్ 4 వేల ఓట్లు తగ్గడం గమనర్హం. ఇలా ఉండగా ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరగడంతో అది టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయానికి సంకేతంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించిన ‘ఆరా’ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ అంచనాల ప్రకారం టిఆర్‌ఎస్‌కు 53.54 శాతం, కాంగ్రెస్‌కు 36.11 శాతం, సిపిఎంతో పాటు ఇతర పార్టీలకు 10.35 శాతం ఓట్లు పోలైనట్టు వెల్లడించింది. గతంలో ‘ఆరా’ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు ఫలితాలకు దరిదాపుల్లోనే ఉన్నాయి. వరంగల్ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ‘ఆరా’ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ వాస్తవానికి దగ్గరిగా ఉన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనతో ఫోన్లో మాట్లాడిన మీడియా ప్రతినిధుల వద్ద 50 వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాతనే విజయ పత్రంతో హైదరాబాద్‌కు వస్తానని కూడా మంత్రి తుమ్మల చెప్పారు.