తెలంగాణ

రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 16: రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించి త్వరలో అన్ని సేవలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని, ఎవరికి ఏం అవసరం ఉన్నా నేరుగా ఆన్‌లైన ద్వారా పొందవచ్చునని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో సబ్ రిజిస్ట్రేషన్ నూతన కార్యాలయ భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో 65 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశామని, సంవత్సరం చివరి నాటికి వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేస్తామని అన్నారు. వచ్చే మూడేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు సిఎం కెసిఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు అధికారులు కృతనిశ్చయంతో పనిచేయాలని సూచించారు. అధునాతన హంగులతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రణాళిలకను తయారు చేస్తున్నామని, అందులో సిఎం కెసిఆర్ కొన్ని మార్పులు చేస్తున్నారని, త్వరలోనే వాటిని సిఎం ఆమోదిస్తారని వివరించారు. ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటి మహాత్తరమై పథకాల అభివృద్ధిపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపి ఎపి జితేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి.శంకర్‌రావు, జాయింట్ రిజిస్ట్రార్ వెంకట్‌రాజేష్, రంగారెడ్డి జోనల్ డిఐజి మధుసూదన్‌రెడ్డి, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ డి.ట్వింకిల్ జోన్, స్థానిక రిజిస్ట్రార్లు దేవానంద్, సులోచనాదేవి, ఎంపిపి బుజ్జినాయక్, జడ్పిటిసి సభ్యురాలు అరుణ, ఎంపిడివో రాజేశ్వరీ, తహశీల్దార్ చందర్‌రావు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ