తెలంగాణ

కరవు సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్ ఘన్‌పూర్, మే 12: రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే సహాయక చర్యలు తీసుకోవాల్సిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనే ఓ రైతుకు చెందిన ఎండిపోయిన వరిపంటను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు అనేకమన్నారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే కనీసం సహాయక చర్యలు చేపట్టడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కరవు సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ. 790 కోట్లు కేటాయించిందన్నారు. కేంద్రప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా రైతులకు అందించలేని దుస్ధితి ప్రభుత్వానికి ఉందంటే భవిష్యత్‌లో రైతులు ఏమేరకు జీవనం సాగిస్తారని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరవు సహాయంపై ఏమేరకు చర్యలు చేపట్టారో శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎండిపోయిన వరిపంట పరిశీలించిన వారిలో రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, జిల్లా నాయకులు, స్థానిక నాయకులు గట్టు కృష్ణ, వేణు, ఆరోగ్యం తదితరులు ఉన్నారు.

చిత్రం ఘన్‌పూర్ మండల కేంద్రంలో ఎండిపోయిన వరిపంటను పరిశీలిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్