తెలంగాణ

ఎమ్మెల్యే వివేకానందకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.వివేకానంద కుటుంబీకులకు చెందిన వాణిజ్య భవనాన్ని కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు వేసవి బెంచ్ తిరస్కరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన భవన కూల్చివేత ఉత్తర్వులను నిలిపి వేస్తూ స్టే మంజూరు చేయాలని ఎమ్మెల్యే కుటుంబీకులు, ఆ భవనంలో ఉన్న నారాయణ కళాశాల దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన ప్లాన్‌కు వ్యతిరేకంగా నిర్మించడమే కాకుండా రోడ్డును ఆక్రమించుకుని నిర్మించినట్లు కె.ఎం.ప్రతాప్ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ చేపట్టి అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను జస్టిస్ పివి సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తిరస్కరించింది. తమ క్లయింట్స్ బిఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసి ఉన్నారని, బిఆర్‌ఎస్ అంశం ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్‌లో ఉన్నందున సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అప్పీలెంట్ల తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. బిఆర్‌ఎస్ అమల్లో ఉన్నప్పుడు ఆ భవనాన్ని నిర్మించలేదని, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వనందున సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని వేసవి బెంచ్ స్పష్టం చేస్తూ ఈ కేసును జూన్ 1 నాటికి వాయిదా వేసింది.
మురుగు కాల్వలను శుభ్రం చేయండి: హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, మున్సిపాలిటీల్లో డ్రైన్లను వెంటనే శుభ్రం చేసి జూన్ 1వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు గురువారం తెలంగాణ మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఇటీవల హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం విదితమే. ఈ కేసును జస్టిస్ పివి సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. మున్సిపల్ అధికారుల తీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ మ్యాన్‌హోల్ ఘటనలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఆ పని అప్పగించిన అధికారులను వెంటనే గుర్తించాలని హైకోర్టు రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. డ్రైన్లను శుభ్రం చేయడం, దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వాటర్‌బోర్డు ప్రభుత్వానికి లేఖ రాయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.