తెలంగాణ

వరంగల్ టాప్ రాజధాని లాస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: టెన్త్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. జిల్లాలవారీ ఫలితాల్లో వరంగల్ జిల్లా అగ్రగామిగా నిలిస్తే, చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది. గత మార్చి 21నుండి జరిగిన పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్ధులు 5,55,265 మంది హాజరయ్యారు. ఇందులో 5,19,494 మంది రెగ్యులర్ అభ్యర్ధులు కాగా 35,771 మంది ప్రైవేటు అభ్యర్ధులు. ఇందులో 4,44,828 మంది రెగ్యులర్ విద్యార్థులు, 14,136 మంది ప్రైవేటు అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంమీద ఉత్తీర్ణత 85.63 శాతం ఉందని , బాలురు 84.7 శాతం, బాలికలు 86.57 శాతం ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. బాలురుకంటే 1.87 శాతం బాలికలు అధికంగా ఉత్తీర్ణులయ్యారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత 39.52 శాతం ఉందని వివరించారు. ఈ ఏడాది 2379 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని, 10 స్కూళ్లు సున్నా ఫలితాలు పొందాయన్నారు. రాష్ట్రంలో వరంగల్ జిల్లా అన్ని జిల్లాలకంటే 95.13 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతం 76.23 సాధించి చివరిస్థానంలో నిలిచిందని అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో 96.84 శాతం ఉత్తీర్ణులయ్యారని, ప్రభుత్వ పాఠశాలలు 77.80 శాతంతో వెనుకబడ్డాయని వివరించారు. ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 85.63కాగా, గత ఏడాది 77.56 శాతం ఉందని, ఈ ఏడాది ఉత్తీర్ణత 8.07 శాతం పెరిగిందన్నారు.
జిల్లాలవారీ ఉత్తీర్ణత
ఈ ఏడాది వరంగల్ 95.13 శాతం, మహబూబ్‌నగర్ 91.19 శాతం, మెదక్ 90.74, నిజామాబాద్ 90.04, కరీంనగర్ 86.40 శాతం, నల్లగొండ 83.75 శాతం, ఆదిలాబాద్ 82.23 శాతం, రంగారెడ్డి 82.07 శాతం, హైదరాబాద్ 76.23 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
15నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
జూన్ 15 నుండి జూన్ 29వరకూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, అందుకు అభ్యర్థులు పరీక్ష ఫీజును ఈనెల 26లోగా చెల్లించాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి చెప్పారు. రీకౌంటింగ్ కోరేవారు సబ్జెక్టుకు 500 చొప్పున చెల్లించాలని, ఇతర వివరాలకు బిఎస్‌ఇ తెలంగాణ డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

చిత్రం... టెన్త్ ఫలితాలు విడుదల చేస్తున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి