తెలంగాణ

ప్రైవేట్ ఇష్టారాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రైవేటు కాలేజీలు పూర్తిచేశాయి. ఏటా ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. దాని ప్రకారమే ఆయా ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు చేపట్టాల్సి ఉన్నా, గత నెల 9న టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు చేపట్టాయి. స్కూళ్లవారీ అభ్యర్థుల డేటాను పరీక్షల బోర్డు కార్యాలయం నుండి సేకరించి కార్పొరేట్ కాలేజీలు ఆయా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఫీజు రాయితీలు ఇచ్చి అడ్మిషన్ ఫారాలు నింపుతున్నాయ. తీరా టెన్త్ ఫలితాలు రాగానే మెరిట్ వచ్చిన విద్యార్థులకు రాయితీలు కొనసాగిస్తుంటే, తక్కువ మార్కులు వచ్చాయి కనుక మీ పిల్లలకు ఫీజు కనె్సషన్ ఇవ్వలేమని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. బహిరంగంగా కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతున్నా, అన్నీ తెలిసి ఆర్‌ఐఓలు, డివిఇఓలు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు కాలేజీలపై ఫిర్యాదులు ఇస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు ఉంటున్నారు. ఏదో రొటీన్‌గా సర్క్యులర్‌లు జారీ చేసి కాలేజీల్లో షెడ్యూలు ప్రకారమే అడ్మిషన్లు జరగాలని చెబుతున్నా నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న అడ్మిషన్లపై అధికారులు మాట్లాడటం లేదు. చాలా కాలేజీలు రెగ్యులర్ డే స్కాలర్ సెక్షన్లలో సాధారణ రెగ్యులర్ కాలేజీ, ఎమ్సెట్ బ్యాచ్, జెఇఇ బ్యాచ్, ఒలింపియాడ్ బ్యాచ్‌తో పాటు తాజాగా ఇంటిగ్రేటెడ్ బ్యాచ్‌లలో అడ్మిషన్లు ఇస్తున్నాయి. డే స్కాలర్‌కు 70 వేల నుండి లక్ష వరకూ వసూలు చేస్తుండగా, రెసిడెన్షియల్ విద్యార్థుల నుండి రెండు నుండి రెండున్నర లక్షలు వసూలు చేస్తున్నాయి. ఫీజులపై ప్రభుత్వం గత ఆరు నెలలుగా పెద్ద పెద్ద ప్రకటనలు చేసినా, కార్పొరేట్ కాలేజీలను అడ్డుకునేందుకు ఇంత వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు, దాంతో లక్షలు చెల్లించి సీట్లను తల్లిదండ్రులు రిజర్వు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం బుధవారం నామ్‌కే వాస్తే అన్నట్టు అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 16నుండి దరఖాస్తులు అమ్మాల్సి ఉంటుంది. దరఖాస్తులను 30లోగా స్వీకరించి, తొలి జాబితాను జూన్ చివరి వారంలో ప్రకటించి జూన్ 30 నుండి అడ్మిషన్లను చేపట్టాలి. తరగతులు మాత్రం జూన్ 1 నుండే ప్రారంభించాలని బోర్డు అధికారులు సూచించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బిసిలకు 29, పిహెచ్‌సికి 3 శాతం, ఎన్‌సిసి, స్పోర్ట్స్‌కు 5 శాతం, ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటాలో 3 శాతం సీట్లను రిజర్వు చేయాలని కూడా బోర్డు అధికారులు సూచించారు. ఇవేవీ పాటించకుండానే ప్రైవేటు కాలేజీల్లో సీట్ల భర్తీ పూర్తయిందని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు.