తెలంగాణ

రూ. 6700 కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద ఎంపికైన 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6,700 కోట్ల రూపాయల సహాయం చేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి సించాయి యోజన పథకం అమలుపై బుధవారం ఢిల్లీలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిధుల విడుదల గురించి కేంద్రాన్ని కోరనున్నారు. జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం సమీక్ష జరిపారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే 11 ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ఈ పథకం కింద గతంలో దేవాదుల ప్రాజెక్టు మాత్రమే ఉండేది. కేంద్ర జల సమన్వయ కమిటీ సభ్యునిగా హరీశ్‌రావును నియమించిన తరువాత కొమరం భీం, గొల్లవాగు, రెల్లివాగు, మత్తడి వాగు, నీల్వాయి, జగన్నాథ ప్రాజెక్టు, పాలెంవాగు, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ, రాజీవ్ భీమా ఎత్తి పోతల పథకాన్ని చేర్చారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి, వరదకాలువ, దేవాదుల, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ, బీమా, పాలెం వాగు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో, పూర్తి చేయడానికి అయ్యే వ్యయంపై ఇరిగేషన్ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు.
పిఎంకెఎస్‌వై పథకం కింద చేపట్టే 11 ప్రాజెక్టులు 2017 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అధికారులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా త్వరితగతిన పూర్తి చేయాల్సిన సంకల్పించిన 149 ప్రాజెక్టులలో తెలంగాణ ప్రాజెక్టులు 11కు చోటు దక్కాయి. గతంలో ఎఐబిపి కింద సాగునీటి పథకాలలో దేవాదుల ఒక్కటే తెలంగాణకు చోటు దక్కింది. ఎఐబిపి కింద గ్రాంట్‌గా 1,155 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఈ 11 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 60 శాతం నిధులు గ్రాంటు రూపంలో ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. మిగిలిన మొత్తాన్ని నాబార్డు ద్వారా రుణం రూపంలో సమకూర్చుకోవడానికి కేంద్రం గ్యారంటీగా ఉండాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బిఎంతో సంబంధం లేకుండా కేంద్రం గ్యారంటీ ఉండాలని కేంద్రాన్ని కోరనున్నారు.