తెలంగాణ

జంట టవర్ల నిర్మాణంపై యథాతథ స్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన కమాండ్, కంట్రోల్ సెంటర్ జంట టవర్ల నిర్మాణంపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ మీర్ అఫ్సర్ అలీ, మరో 16 మంది దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తమకు ఉన్న 8 ఎకరాల్లో ఐదు ఎకరాలను తాము అనుభవిస్తున్నామని, ఆ ఐదు ఎకరాలను తమ పేరుమీద రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నా రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి పట్టించుకోవడం లేదని హైకోర్టుకు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం టవర్ల నిర్మాణంపై యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.