తెలంగాణ

అంధ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అంధులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇది దేశానికే ఆదర్శంగా ఉంటుందని హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్-జనరల్ వినోద్ కుమార్ అగ్రవాల్ పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో సోమవారం ప్రారంభమైన శిక్షణ ద్వారా 400 మంది అంధ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అంధ ఉద్యోగులు తమ శక్తిసామర్థ్యాలకు గుర్తింపు ఉండాలని భావిస్తున్నారని దేవనార్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, డాక్టర్ సాయిబాబా గౌడ్ పేర్కొన్నారు.