తెలంగాణ

కాలేజీల్లో తనిఖీలు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో సోమవారం ఏకకాలంలో అధికారుల బృందాలు తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించాయి. కాలేజీల్లో నిర్వహించే రికార్డులు అన్నింటినీ ఆయా కాలేజీలు సమర్పించిన సెల్ఫ్ అప్రైజల్ (స్వీయ నివేదికలు)తో సరిపోల్చి చూశాయి. ఈ బృందాల్లో విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్శిటీల ప్రొఫెసర్లు, బిట్స్ పిలానీ ప్రొఫెసర్లు, పోలీసు సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థలపై ఈ బృందాలు దాడులు నిర్వహించడంతో పెను సంచలనం చెలరేగింది. అందుబాటులో ఉన్న బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందితో ఈ బృందాలు మాట్లాడి వారికి ఇస్తున్న జీతాలు, భత్యాలు, రికార్డులు, విద్యార్థుల నుండి వసూలు చేస్తున్న ఫీజులు తదితర వివరాలను రికార్డు చేశాయి. అనంతరం యాజమాన్యాలతో సంతకాలు చేయించుకుని కీలక పత్రాలను తీసుకువెళ్లినట్టు తెలిసింది.