తెలంగాణ

పాలేరు ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 9: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్నకొద్దీ మాటలకు పదునుపెడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్, వామపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే తామని, రెండేళ్లలో చేసింది శూన్యమంటూ టిఆర్‌ఎస్ నేతల వైఖరిపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ నేతలకు సవాళ్లు విసురుతూ కాంగ్రెస్ వైఖరి వల్లే రాష్ట్రం అథోగతి పాలైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మాటల యుద్ధం చివరికి వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేసుకునే స్థాయికి దిగజారింది. తమ అభ్యర్థి ఓటమిపాలైతే రాజీనామా చేస్తానని ఒక నేత ప్రకటించగా, చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడంటూ ప్రత్యర్థులు ఆయన్ను ఎద్దేవా చేశారు. మరికొందరు అప్పటి అభివృద్ధి, ఇప్పటి అభివృద్ధిపై విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా గతంలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా సుమారు 9మంది రాష్ట్ర మంత్రులు, 20మందికి పైగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా 10మంది వరకు మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర నేతలను ప్రచారంలోకి దింపింది. వీరు ప్రచారంలో అధికార పార్టీ వైఖరిని ఎండగడుతున్నారు. ఈ రెండు పార్టీలకు దీటుగా వామపక్షాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులకు తోడు రాష్టస్థ్రాయి నేతలు ప్రచారంలో పాల్గొంటూ ఇరు పార్టీల వైఖరిని ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయం, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను వదిలేసి మాటల గారడీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే ఆది, సోమవారాల్లో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల పరిధిలోని ఓ గ్రామానికి ఒకేరోజు మూడు పార్టీల ప్రధాన నేతలు హాజరై ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దీన్ని గ్రామస్తులు ప్రశ్నించారు కూడా. అయితే సర్దుబాటు చేసుకుంటూ తమకు మద్దతునివ్వాలని మాత్రం చెప్పుకుంటూ నేతలు ఊరు దాటారు. ఇదే పరిస్థితి నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా, ప్రచార సరళిపై ప్రజలు గుసగుసలాడుతున్నారు.