తెలంగాణ

కరవును మరచి కమిషన్లపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, మే 9: రాష్ట్ర ప్రభుత్వం కరవును విస్మరించి, కమీషన్లపైనే దృష్టి పెట్టిందని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధనూర్‌లో అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కమార్ సోమవారం తలపెట్టిన దీక్షకు హైదరాబాద్ నుండి వెళ్తున్న ఆయన జడ్చర్లలోని జాతీయ రహదారిపై ఆగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ నీరో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. తెరాస సరాకరు మెడలు వంచి కరవు నివారణ చర్యలు చేపట్టేలా పోరాడుతామని హెచ్చరించారు. మంత్రి కెటిఆర్ విసిరిన సవాల్‌పై ప్రశ్నించగా, ఆయన ‘ఓ బచ్చా’ అని, కెసిఆర్ మాట్లాడితే స్పందిస్తానని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం ఉత్తమ్‌కు స్వాగతం పలుకుతున్న నేతలు