తెలంగాణ

పశువుల ఉసురు తీసిన ‘పవర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 9: ప్రకృతి వైపరీత్యాలతో పశువులను కాపాడుకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతుంటే విద్యుత్ తీగలు మూగజీవాల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. గంటల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు సంఘటనల్లో 29 పశువులు మృత్యువాత పడ్డాయి. మెదక్ జిల్లాలోని కల్హేర్, న్యాల్‌కల్ మండల్లాల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో పాడి రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కంగ్టి మండలంలోని వివిధ గ్రామాలు, తండాల నుంచి 409 పశువులను మేతకు తీసుకెళ్లిన రైతులు వాటిని వారం రోజుల నుంచి రాత్రి సమయాల్లో సంగ్రాం భూమయ్య అనే రైతు పొలంలో నిలుపుతున్నారు. అయతే పొలం నుంచి వెళుతున్న 11 కెవి విద్యుత్ వైర్లలో ఒకటి ఆదివారం రాత్రి తెగి పశువులపై పడింది. దీంతో కంగ్టి తండా వాసుడైన దోమనాయక్‌కు చెందిన 9 ఆవులు, తుర్కవాడ గ్రామ పంచాయతీ సాదుల్ తండాలోని గోవింద్ నాయక్‌కు చెందిన 13 ఆవులు, గాజులపాడులోని రాచప్ప స్వామికి చెందిన ఒక గేదె అక్కడికక్కడే మృతిచెందాయి. అనంతరం ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మరింత నష్టం తప్పింది.
ఇదిలావుంటే, న్యాల్‌కల్ మండలం ఇబ్రహీంపూర్‌లో కూడా ఇదేవిధమైన మరో ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం పెనుగాలులతో వర్షం కురవడంతో 11 కెవి విద్యుత్ స్తంబాలు కిందికి వంగిపోయాయ. ఆ ప్రాంతంలో మేత మేస్తున్న పశువులు విద్యుత్ వైర్లను తాకడంతో ఆరు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక్కో ఆవు ఖరీదు కనీసం 30 వేలకు తగ్గకుండా ఉంటుందని, వీటి మరణంతో తీవ్రంగా నష్టపోయిన తమకుట్రాన్స్‌కో అధికారులు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

చిత్రం అంతర్‌గావ్ గ్రామ శివారులో మృతి చెందిన పశువులు