తెలంగాణ

సర్కార్‌కు ఢోకాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 9: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో జరిగిన తెలంగాణ విద్వత్ పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేద విద్వత్ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా బ్రాహ్మణులను పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వందకోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉన్నంతకాలం సర్కార్‌కు ఢోకాలేదని ఆయన అన్నారు. బ్రాహ్మణుల పూజా ఫలితం, సిఎం కెసిఆర్ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. బ్రాహ్మణులను గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్లేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన వందకోట్లు తక్కువేనని, భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు.