తెలంగాణ

ఉసురు తీసిన ఉయ్యాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, మే 8: తోటి స్నేహితులతో ఉయ్యాల ఊగుతుండగా ప్రమాదవశాత్తు దాని తాడు మెడకు బిగిసుకుని ఓ బాలిక దుర్మరణం పాలైన విషాద సంఘటన ఇది. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సున్నంబట్టీ వీధిలోని కోర్సా రాంబాబు, రాధల కుమార్తె సమత(7) ఆదివారం మధ్యాహ్నం ఇంటి వెనుక ఉన్న మామిడిచెట్టుకు కొబ్బరి తాడుతో ఉయ్యాల కట్టుకుని తోటి పిల్లలతో ఊగుతూ ఆడుతోంది. కొంత సమయానికి అందరూ వెళ్లిపోగా, సమత మాత్రం ఒంటరిగా ఉయ్యాల ఊగుతుండగా దాని తాడు బాలిక మెడకు చుట్టుకుంది. తాడు మెడకు బిగుసుకుపోవడంతో అరిచే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇదేమీ తెలియని తల్లిదండ్రులు ఇంట్లో టీవీ చూస్తూ ఉండిపోయారు. ఎంతకీ సమత ఇంటిలోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితికి చేరుకుని కనిపించింది. స్థానికుల సహాయంతో స్థానిక వైద్యశాలకు తరలించగా అప్పటికే బాలిక ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రాంబాబు గిరిజన సహకార సంస్థ గోదాములో హమాలీగా పని చేస్తున్నాడు. సమత నాల్గవ తరగతి చదువుతోంది.