తెలంగాణ

కార్మికులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: అసంఘటిత కార్మికులకు శుభవార్త. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు కాబోతున్నాయి. కార్పోరేట్ తరహా వైద్య సేవలు అందించనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సి. లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదర్శ నగర్‌లోని ఇఎస్‌ఐసి కార్యాలయంలో ఆదివారం దత్తాత్రేయ, లక్ష్మారెడ్డిలు ‘నిమ్స్’ డైరెక్టర్ మనోహర్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రి, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రుల సూపరింటెండ్లతో సమావేశమై కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై చర్చించారు. సమావేశానంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ అసంఘటిత కార్మికులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. అసంఘటిత కార్మికులకు ఇఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తున్నామని, అయితే తొలి విడతగా భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ కార్డులు జారీ చేస్తామని, ఆ కార్డులు ఉన్నవారు ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రి, నిమ్స్, కోరంటి (నీలోఫర్) ఆసుపత్రులకు వైద్య సౌకర్యం కోసం వెళ్ళవచ్చన్నారు. ఈ మేరకు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిందిగా తాము చేసిన సూచనకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఇంత కాలం ఎమర్జెన్సీ కేసుల్లో ఇఎస్‌ఐ డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతున్నదని, ఆ వైద్య ఖర్చులు ఇఎస్‌ఐ భరిస్తున్నదని చెప్పారు. ఇకమీదట కార్పొరేట్ వైద్య ఖర్చులు ప్రైవేటు ఆసుపత్రులకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు మళ్లించి, ప్రభుత్వ ఆసుపత్రులను మరింత పరిపుష్టం చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులకు- ఇఎస్‌ఐని అనుసంథానం చేయనున్నట్లు తెలిపారు. తాను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి ఒప్పందం చేయనున్నట్లు చెప్పారు. సనత్‌నగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయిస్తామని, ఇఎస్‌ఐ ఆసుపత్రిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణకూ ఎయిమ్స్ ఇస్తామన్న కేద్ర మంత్రి అరుణ్ జైట్లీ అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపారు. క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నందున పేదల కోసం ట్రోమా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విలువైన పరీక్షలన్నింటినీ నిర్వహించనున్నట్లు, పుట్టిన పిల్లలను రక్షించడానికి అవసరమైన (నియోనాటల్ సర్జరీ) సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ వివరించారు.
జర్నలిస్టులకు సిజిహెచ్‌ఎస్
ఢిల్లీ తరహాలో తెలంగాణలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సిజిహెచ్‌ఎస్) సౌకర్యం కల్పించేందుకు కేంద్ర వైద్య శాఖ మంత్రితో మాట్లాడుతానని దత్తాత్రేయ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
గర్బిణిలకు ఉచిత వాహనం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర సహాయాన్ని కోరామని అన్నారు. గర్బిణీ స్ర్తిలను ఇంటి నుంచి ఆసుపత్రికి, తిరిగి ఇంటికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రం... మీడియాకు వివరాలు
వెల్లడిస్తున్న దత్తాత్రేయ, లక్ష్మారెడ్డి