తెలంగాణ

జూరాలకు నీళ్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: మంచినీటి అవసరాల కోసం నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కర్నాటక నీటిపారుదలమంత్రి ఎంబి పాటిల్‌ను కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్రమైన మంచినీటి సమస్య ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లివ్వాలని కోరారు. గతంలో సైతం హరీశ్‌రావు ఈ అంశాన్ని కర్నాటక ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కర్నాటక మంత్రి సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ నియమించిన సమన్వయ కమిటీ నాలుగవ సమావేశం ఈనెల 11న ఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి హాజరు కావాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాశారు. కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు హరీశ్‌రావు 11న ఢిల్లీ వెళతారు. కమిటీలో సభ్యునిగా ఉన్న హరీశ్‌రావు ఈ పథకం అమలుకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులను ప్రధానమంత్రి సించాయి యోజన పథకం కిందకు తీసుకు రావడంలో హరీశ్‌రావు క్రియాశీలకంగా వ్యవహరించారు.