తెలంగాణ

వెల్‌కమ్ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: చాలా రోజుల తరువాత సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ యాత్రకు బయలు దేరుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో కరువు పరిస్థితులపై ఆయా సిఎంలతో ప్రధాని స్వయంగా చర్చిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సిఎంలతో చర్చించిన తరువాత మూడవ రాష్ట్రంగా తెలంగాణ కరవు పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిఎం కెసిఆర్‌ను ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఈమేరకు సిఎం కరవుకు సంబంధించిన వివరాలతో ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా తెలంగాణలో ఈనెలలోనే పర్యటించనున్నారు. నరేంద్ర మోదీ, కెసిఆర్‌ల భేటీలో ప్రధాన మంత్రి పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉంది. సోమవారం రాత్రి కెసిఆర్ ఢిల్లీ చేరుకుంటారు. మంగళవారం ఉదయం ప్రధానిని కలుస్తారు. రాష్ట్రంలోనెలకొన్న కరువు పరిస్థితితో పాటు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై భేటీలో చర్చిస్తారు. రాష్ట్ర విభజన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిని ప్రధానమంత్రితో జరిగే సమావేశంలో సిఎం ప్రస్తావిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పథకాలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పథకాలకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయాన్ని ఆశిస్తోంది. నీతి ఆయోగ్ సభ్యులు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఈ పథకాలను స్వయంగా పరిశీలించారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందే విధంగా నివేదికలు ఇవ్వనున్నట్టు చెప్పారు. గత నెలలో హైదరాబాద్‌లో ఈ పథకాలను సమీక్షించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ పథకాలు దేశం మొత్తంలో అమలు చేయాలని సూచించారు. నీతి ఆయోగ్ సభ్యులు సైతం ఇదే విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మంచినీటి సమస్య ఉందని, ప్రధానమైన ఈ సమస్యను పరిష్కరించే మిషన్ భగీరథ పథకానికి అవసరం అయిన నిధులు కొంత వరకు కేంద్రం భరించడం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రధానమైన సమస్య తీర్చేందుకు తోడ్పడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రిని కోరనున్నారు.
ఈనెలలోనే ప్రధాన మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నారు. రామగుండంలో నెలకొల్పే ఎరువుల కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి హాజరవుతారు. రెండు నెలల క్రితమే నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రధానమంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యక్రమం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తరువాత ఖరారు అవుతుంది. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం మోదీ ఆంధ్రలో పర్యటించినా, తెలంగాణకు ఇప్పటి వరకు హాజరు కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారంలో ప్రస్తావించింది. మోదీ తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నందున కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బిజెపి భావిస్తోంది.
తెలంగాణ పెండింగ్ సమస్యలను ప్రధానమంత్రికి ఢిల్లీ భేటీలో వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీతో పాటు వివిధ అంశాల పరిష్కారానికి ఆలస్యం అవుతున్న అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రికి వివరిస్తారు.
ప్రధానంగా రాష్ట్రంలో కరవు పరిస్థితిని ప్రధానమంత్రికి వివరించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటిస్తున్నందున రాష్ట్రంలో కరువుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ అధికారులతో ఆదివారం అత్యవసరంగా సమావేశం అయ్యారు. కరవు పరిస్థితిపై ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి బుధవారం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.